కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో ఏపీకి రూ.4లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. సీఎం చంద్రబాబు కృషి కారణంగానే పరిశ్రమలు, పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ ఉందన్నారు. కేంద్రం నుంచి, పరిశ్రమలు, పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి జగన్ తెచ్చింది శూన్యమని విమర్శించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో విశాఖ ఉక్కు ప్రయోజనాలను కూడా తాకట్టు పెట్టేశారని మండిపడ్డారు. 7 నెలల్లోనే ఐదేళ్ల వైసీపీ - కూటమి పాలన మధ్య తేడాను ప్రజలు గమనించారని అన్నారు. వినుకొండలో శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 4 బస్ షెల్టర్లు నిర్మిస్తామని చెప్పారు. త్వరితగతిన వినుకొండ రామలింగేశ్వరాలయం, ఘాట్‌రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.