లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా చేయాలనే వ్యాఖ్యలపై కానీ, సీఎం, డిప్యూటీ సీఎం పదవులకు సంబంధించిన అంశాలపై జనసైనికులు బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని జనసేన అధిష్టానం తమ శ్రేణులకు సూచించింది. పార్టీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని పేర్కొంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ సీఎం పదవిపై టీడీపీ, జనసేన నేతల మధ్య చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో పోటాపోటీగా పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టాలని టీడీపీ హైకమాండ్ తమ పార్టీ శ్రేణులకు సోమవారం ఆదేశాలు జారీచేసింది. తాజాగా జనసేన హైకమాండ్ సైతం డిప్యూటీ సీఎం అంశంపై బహిరంగంగా చర్చించవద్దని, ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని తెలిపింది. పార్టీ లైన్ కు విరుద్దంగా ఎవరైనా మాట్లాడితే సహించేది లేదని జనసేన అధిష్టానం స్పష్టంచేసింది.