పశువైద్యశిబిరాలను ప్రతి రైతు ఉపయోగించుకోవాలని కడప డివిజను సహాయ సంచాలకులు రమణయ్య, కమలాపురం ఏడీ ఏ ఉత్తన్న తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని సముద్రంపల్లెలో నిర్వహించిన పశువైద్యశిబిరాన్ని వారు ప్రా రంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమలాపురం డివిజను పరిధిలోని పశువైద్యశాల పరిధిలో మంగళవారం నుంచి 31 వరకు నిర్వహిస్తున్న పశు ఆరోగ్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందులో భాగంగా కమలాపురం మండల పందిళ్లపల్లె, పెద్దచెప్పలి పశువైద్యశాల పరిధిలోని గ్రామాల్లో పశు ఆరోగ్యశిబిరం నిర్వహించామన్నారు. ఈ శిబిరాల్లో ఉచిత పశు వైద్యులచే ఉచిత వైద్యం తో పాటు తేలికపాటి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారన్నారు. ఎద కు రాని, చూలు కట్టని పశువుల గర్భకోశ వ్యాధులకు పరీక్షలు చేస్తారన్నారు. గొర్రెలకు ఉచితంగా బొబ్బ వ్యాధి నివారణ టీకాలు అందిస్తామని పేర్కొన్నారు. పందిళ్లపల్లెలో జరిగిన పశువైద్య శిబిరంలో 20 పశువులకు సాధారణ చికిత్సలు, ఐదు గర్భకోశ వ్యాధుల కు చికిత్సలు, 60 పశువులకు నట్టల నివారణ మందు, 198 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందును అందించామన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సహాయ శస్త్ర చికిత్సకులు డాక్టర్ మల్లిఖార్జునరెడ్డి, సచివాలయ ఏహెచఏలు సుబ్బలక్ష్మి, శిరీష, జ్యోతి, ఆఫీసు సబార్డినేట్ పవనకుమారి, రైతులు తదితరులు పాల్గొన్నారు.