ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్‌న్యూస్‌

national |  Suryaa Desk  | Published : Thu, Jan 23, 2025, 10:41 AM

నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్‌న్యూస్‌.. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో గ్రూప్‌-డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఈ మేరకు లెవల్-1 పోస్టులకు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద దాదాపు 32,438 గ్రూప్‌ డి పోస్టులను భర్త చేయనున్నారు. పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్‌తో సహా తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్‌పుర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్.. ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. ఆర్‌ఆర్‌బీ లెవల్‌-1 గ్రూప్-డి పోస్టులన్ని ఎస్‌ అండ్‌ టీ, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఇంజినీరింగ్‌, ట్రాఫిక్‌ విభాగాల్లో ఉన్నాయి.


పోస్టులు వివరాలు..
పాయింట్స్‌మన్‌ పోస్టుల సంఖ్య: 5,058
అసిస్టెంట్‌ (ట్రాక్‌ మెషిన్‌) పోస్టుల సంఖ్య: 799
అసిస్టెంట్‌ (బ్రిడ్జ్‌) పోస్టుల సంఖ్య: 301
ట్రాక్ మెయింటెయినర్ గ్రూప్-4 పోస్టుల సంఖ్య: 13,187
అసిస్టెంట్‌ పీ-వే పోస్టుల సంఖ్య: 247
అసిస్టెంట్‌ (సీ అండ్‌ డబ్ల్యూ) పోస్టుల సంఖ్య: 2587
అసిస్టెంట్‌ లోకో షెడ్‌ (డిజిల్‌) పోస్టుల సంఖ్య: 420
అసిస్టెంట్‌ (వర్క్‌షాప్‌) పోస్టుల సంఖ్య: 3077
అసిస్టెంట్‌ (ఎస్‌ అండ్‌ టీ) పోస్టుల సంఖ్య: 2012


అసిస్టెంట్‌ టీఆర్‌డీ పోస్టుల సంఖ్య: 1381


అసిస్టెంట్‌ లోకో షెడ్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టుల సంఖ్య: 950


అసిస్టెంట్‌ ఆపరేషన్స్‌- (ఎలక్ట్రికల్‌) పోస్టుల సంఖ్య: 744


అసిస్టెంట్‌ టీఎల్‌ అండ్‌ ఏసీ పోస్టుల సంఖ్య: 1041


అసిస్టెంట్‌ టీఎల్‌ అండ్ ఏసీ (వర్క్‌షాప్‌) పోస్టుల సంఖ్య: 625


ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి లేదా ఐటీఐ డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లేదా నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ వొకేషనల్‌ ట్రైనింగ్‌ (NCVT) జారీ చేసిన నేషనల్‌ అప్రెంటిషిప్‌ సర్టిఫికెట్‌ (NAC) లేదా సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత పొంది ఉండాలి. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జులై 01, 2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, పీహెచ్‌ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.


 


ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 22, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.18,000తోపాటు ఇతర అలవెన్స్‌లు కల్పిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com