గిద్దలూరులోని ఏరియా ఆస్పత్రిలో రేడియాలజిస్టు, పిడియాట్రిషియన్, అనస్తీషియా వైద్యులను నియమించాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి కోరారు. ఆస్పత్రిలో ఉన్న నియోనాటల్ కేర్ యూనిట్‌ను స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేయాలన్నారు. కంభం ఆస్పత్రిలో డాక్టర్ పోస్టులను భర్తీచేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. నియోజకవర్గంలో పలు గ్రామాల్లో 500 అడుగుల కంటే లోతులో ఉన్న బోర్లు మాత్రమే పనిచేస్తున్నాయని, వేసవిని దృష్టిలో పెట్టుకొని అన్నింటికి మరమ్మతులు చేయాలని కోరారు. అలానే దర్శిలోని ప్రభుత్వ వైద్యశాలకు మదర్ బ్లడ్‌బ్యాంకుగా చీరాల ఉండేదని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. కొత్త జిల్లా ఏర్పడినందున మదర్ బ్లడ్‌బ్యాంకును కూడా ప్రస్తుత జిల్లాలోనే అనుసంధానం చేసే విధంగా చూడాలన్నారు. దర్శి ఆస్పత్రికి తాత్కాలిక మార్చురీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్‌ఏపీ ప్రాజెక్టులోని ఫిల్టర్‌బెడ్లు దెబ్బతిన్నాయని, వాటిని మార్చాలని తెలిపారు.