కనిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అదేశాల మేరకు మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుక కార్యక్రమం గురువారం పామూరులోని స్థానిక విరాట్ నగర్ ఏలిమెంట్రీ స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు.
పామూరు పట్టణ టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు నొస్సం నాగేంద్ర చారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా కేక్ కటింగ్ జరిగింది. అనంతరం విద్యార్థిని , విద్యార్థులకు పెన్నులు, బిస్కెట్ పాకెట్స్ అందజేశారు.