వరికుంటపాడు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు చండ్ర మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఐటీ , మానవ వనరుల, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టిడిపి నాయకులు భారీ కేక్ కట్ చేసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. వరికుంటపాడు మండలం పరిధిలోని పలు గ్రామాల్లో కూడా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి.