ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గురువారం రైల్వే కోడూరు టిడిపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు, రోగులకు పండ్లను పంపిణీ చేసి హాస్పిటల్ ఆవరణలో ముక్కా విశాల్ రెడ్డి, సాయి వికాస్ రెడ్డి మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కేకే చౌదరి, సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ పాల్గొన్నారు.