బి. కొత్తకోట మండల నూతన తహసిల్దార్ గా నియమితులైన మహమ్మద్ అజహారుద్దీన్ గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. రాయచోటి కలెక్టర్ కార్యాలయంలో డిటిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈయనను బి. కొత్తకోట తహసిల్దార్ గా నియమిస్తూ కలెక్టర్ శ్రీధర్ ఉత్తర్వులు ఇచ్చారు.
డిటి మొహమ్మద్ అన్సారి, వీరాంజనేయులు ఆయనకు పుష్ప గుచ్ఛం ఇచ్చి సాగర స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.