భీమిలి లో హనీ ట్రాప్ కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా వాసి రామారావుకు ఈనెల (జనవరి) 18వ తేదీ నుంచి ఓ యువతి ఫోన్ కాల్స్ చేస్తోంది. రామారావు19న పెద్దిపాలెం వెళ్తుండగా ఆ యువతి మరోసారి ఫోన్ చేసింది. సంగివలస మూడుగుళ్ల వద్దకు రావాలని కోరింది. ఆమె చెప్పిన ప్రదేశానికి వచ్చిన వెంటనే గుర్తు తెలియని నలుగురు దుండగులు రామారావును కిడ్నాప్ చేశారు. దాకమర్రిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. రామారావు వద్ద ఉన్న రూ. 48 వేలు, ఏటీఎం కార్డులు దుండగులు తీసుకున్నారు. అయితే రామారావు ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేదు. దీంతో రామారావు ఖాతా నుంచి మరో రూ. 7 వేలు డ్రా చేశారు. దీంతో నగదు మాయంపై బాధితుడు రామారావు భీమిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఆధారాలమేరకు కేసు నమోదు చేసి నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.