అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అక్రమ వలసదారులను అధికారులు అరెస్టు చేశారు. మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్‌ల సాయంతో వందల మందిని బహిష్కరించామని వైట్‌హౌస్ మీడియా అధికార ప్రతినిధి కరోలీన్ లీవిట్ తెలిపారు. వివిధ నేరాల్లో పాల్గొన్న 538 మంది నేరస్థులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చుతున్నారని కరోలీన్ లీవిట్ పేర్కొన్నారు.