ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. మీడియాతో మాట్లాడుతూ... ‘‘అదానీపై చర్యలకు తీసుకునేందుకు చంద్రబాబుకు కచ్చితమైన సమాచారం కావాలట .. సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటారట. బాబు మాటలు ఈ దశాబ్ధపు అతి పెద్ద జోక్’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకు వెళ్ళారని ప్రశ్నించారు. అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని ఎందుకు అన్నారని అడిగారు.అదానీ పవర్ ఎక్కువ రేటు పెట్టి కొనడంతో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయలు భారం పడిందని ఎందుకు చెప్పారని.. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అదానీకి దోచి పెడుతున్నారు అని ఎందుకు ఆరోపణలు చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రతిపక్షంలో ఉండగా అదానీ మీకు శత్రువని.. అధికార పక్షంగా అదే అదానీ మిత్రుడయ్యారని విమర్శించారు.