ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి7న హైదరాబాద్‌లో జరిగే లక్షల డప్పులు, వేల గొంతుల మహాప్రదర్శనను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సవరపు భైరవమూర్తి పిలుపునిచ్చారు. అమలాపురం పరిధిలోని రోళ్లపాలెం దండోరా పేటలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి నూటుకుర్తి సత్యనారాయణ తదితరులతో కలిసి ప్రచారం నిర్వహించారు. అధిక సంఖ్యలో మాదిగ అనుబంధ కులాలప్రతినిధులు మహాప్రదర్శనను విజయవంతం చేయాలని డప్పులు కొడుతూ పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుమర్తి మోహన్, సీనియర్ నాయకులు ఆకుమర్తి ఆశీర్వాదం, చుట్టుగుళ్ల నీలకంఠం, లూటుకుర్తి చిన్నా, ఖండవల్లి ఏలియా, ఉందుర్తి కిశోర్, చేట్ల దుర్గారావు, మల్లవరపు వెంకన్న, పలివెల మోహనరావు, దిగుమర్తి బాబూరావు పాల్గొన్నారు.