తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేసినట్లు గుర్తించారు. 2023 నవంబర్ 15 నుంచి 30 మధ్య 15 రోజుల పాటు ట్యాప్ అయినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆయన పీఏ నిన్న విచారణకు హాజరయ్యారు. 2023 DECలో అధికార మార్పిడి తర్వాత ఫోన్ ట్యాపింగ్ వెలుగులోకి వచ్చింది. బీజేపీ నేత అయిన ఇంద్రసేనా రెడ్డి 2023 అక్టోబర్‌లో త్రిపుర గవర్నర్‌గా నియమితులయ్యారు.