ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజాస్వామ్యంలో మన ఆలోచనలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 25, 2025, 01:23 PM

స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ రాజకీయ పార్టీ చేయలేనంత గొప్పగా వైయ‌స్ఆర్‌సీపీ  అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు మంచి చేసిందని, దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందని పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో తమ ఆలోచనలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే పార్టీలకే సానుకూలత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆ దిశలోనే వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత  వైయస్‌ జగన్‌ ఆలోచనలు, ఆచరణను పార్టీ నేతలు ఆత్మవిశ్వాసంతో ప్రజల్లో వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో శుక్ర‌వారం మీడియా కమ్యూనికేషన్స్‌పై వర్క్‌షాప్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌ల‌కు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా క‌మ్యూనికేష‌న్స్‌పై దిశానిర్దేశం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com