ఎచ్చెర్ల మండలంలోని కుశాలపురం జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్ ను బలంగా ఢీకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. హుటాహుటిన స్పందించిన స్థానికులు 108 సహాయంతో శ్రీకాకుళంలోని ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa