మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక వస్తున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇది కావడంతో.. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది.ఒక సంవత్సరం పాటూ ఈ దేశాన్ని ముందుకు నడిపించే బడ్జెట్‌ని ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఉదయం 11 గంటలకు ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టి.. ప్రసంగం ప్రారంభిస్తారు. దాదాపు గంటన్నరపాటూ ప్రసంగిస్తారని తెలుస్తోంది.