కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రైతులకు భారీ ఊరట కలిగే ప్రకటన చేశారు. పీఎం కిసాన్ క్రెడిట్ స్కీమ్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశారు.ఈ లిమిట్ పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు .దీని వల్ల చాలా మందికి ఊరట లభించనుంది.కిసాన్ క్రెడిట్ కార్డు లిమిట్ ప్రస్తుతం రూ. 3 లక్షల వరకు ఉంది. అంటే ఈ స్కీమ్ కింద బ్యాంకుల నుంచి రైతులు రూ. 3 లక్షల వరకు లోన్ పొందొచ్చు. అయితే ఈ లిమిట్‌ను ఇప్పుడు రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. అంటే ఇకపై అన్నదాతలు రూ. 5 లక్షల వరకు రుణం పొందొచ్చు. అలాగే అన్నదాతల కోసం స్పెషల్ స్కీమ్ ప్రకటించారు నిర్మలమ్మ. దీని పేరు పీఎం ధన్ ధన్య కృషి యోజన. ఈ పథకం వల్ల దాదాపు 1.7 కోట్ల మంది రైతులకు ఊరట లభిస్తుందని ఆమె ప్రకటించారు.