విజయనగరం జిల్లా, మెరకముడిదాం గ్రామానికి చెందిన బాలి గౌరినాయుడు (50) అనే వ్యక్తి శుక్రవారం ట్రాక్టర్‌పై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గౌరినాయుడు వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగానే శుక్రవారం ఉదయం పనికి వెళ్లగా మెరక ముడిదాం, సోమలింగాపురం గ్రామాల మధ్య పొలంలో ట్రాక్టర్‌పై వరిగడ్డి ఎక్కిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. తోటి కూలీలు, రైతులు వైద్యుడికి చూపించారు. అప్పటికే గౌరినాయుడు మృతి చెందాడు. మృ తుడికి గౌరినాయుడుకు భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలు సుకున్న ఎస్‌ఐ లోకేశ్‌కుమార్ ఘటన స్థలం పరిశీలించి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీపురుపల్లి సీహెచ్‌సీకి తరలించారు.