కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబునాయుడు ఘోరంగా విఫలమయ్యారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆక్షేపించారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 12 మంది ఎంపీలతోనే బీహార్ కేంద్ర బడ్జెట్‌లో సింహభాగం నిధులను సాధించగలిగిందని, 16 మంది ఎంపీలు ఉన్నా, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడంలో సీఎం చంద్రబాబు అసమర్థుడిగా నిల్చారని గుర్తు చేశారు. చివరకు రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవం ప్రాజెక్టు ఎత్తుపైనా సీఎం రాజీపడుతున్నారని, దీని వల్ల చాలా నష్టం జరుగుతుందని ధ్వజమెత్తారు.