కాంగో సైన్యం, రువాండా మద్దతున్న ఎం23 తీవ్రవాదుల మధ్య భీకర యుద్ధం సాగుతోందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఈ పోరాటంలో కనీసం 700 మంది మృతి చెందగా.. 2,800 మంది వరకు గాయాలపాలయ్యారని పేర్కొంది. ఇప్పటికే గోమా నగరాన్ని, ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకున్న తీవ్రవాదులు దక్షిణాన ఉన్న కివు ప్రావిన్స్‌లోకి శరవేగంగా చొచ్చుకు వస్తున్నారని వెల్లడించింది.