తిరుపతి నగర పాలక సంస్థ ఉప మేయర్ ఎన్నికలు రేపు జరగనున్న నేపథ్యంలో రోజా.. ఎన్నికల అధికారి నీలమ్ సాహ్నికి లేఖ రాశారు. వైసీపీ అభ్యర్థి శేఖర్ రెడ్డిని ప్రజాస్వామ్య బద్ధంగా తమ బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం లేకుండా అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు మున్సిపల్ సిబ్బంది భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పైస్థాయి అధికారుల ప్రమేయం లేకుండా క్రింది స్థాయి సిబ్బంది అలా వ్యవహరించలేదన్నారు. ఈ విషయమై జోక్యం చేసుకోవాలని విన్నవిస్తున్నా అంటూ రోజా ట్వీట్ చేశారు.