ఇంగ్లండ్ బౌలర్ల అభిషేక్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఐదో టీ20ల్లో ప్రతి ఇంగ్లిష్ బౌలర్‌ను ఓ ఆటాడుకుంటున్నాడీ భారత్ ఓపెనర్. ఈ క్రమంలో 37 బంతుల్లోనే సెంచరీ బాదాడు. దీంతో భారత్ తరఫున టీ20ల్లో వేగంగా సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ (35 బంతుల్లో) తొలి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం భారత స్కోరు 10.1 ఓవర్లకు 145/2.ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ రికార్డు సాధించాడు. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది వేగవంతమైన ఫిఫ్టీల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అభిషేక్ (53*) దూకుడుకి ఐదు ఓవర్లలో భారత్ వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్‌లో ఆర్చర్‌కు రెండు సిక్స్‌లు, ఒక బౌండరీతో చుక్కలు చూపించిన శాంసన్ (16) రెండో ఓవర్‌లో తన బలహీనతను మరోసారి చాటుకున్నాడు. వుడ్ బౌలింగ్ షార్ట్ బంతికి బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ దగ్గరున్న ఆర్చర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రెండు ఓవర్లకు భారత్ 21/1గా ఉంది.