ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒంట్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ని కరిగించి గుండె ఆరోగ్యాన్ని కాపాడే వంటనూనెలు

Life style |  Suryaa Desk  | Published : Sun, Feb 02, 2025, 09:11 PM

​కొలెస్ట్రాల్‌ ఉంటే మనకి వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా, గుండెసమస్యల వంటి ప్రమాదకర సమస్యలొస్తాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు మన డైట్‌లో మార్పులు చేయాలి. అందుకోసం ముఖ్యంగా, మనం వాడే వంట నూనెలు మార్చాలి.


కొన్ని రోజుల క్రితం గానుగ పట్టిన వంట నూనెలు వాడేవారు. ఇవి ఆరోగ్యానికి మంచివి. పైగా ఎలాంటి కల్తీ ఉండవు. మనంతట మనమే తయారుచేసుకుని వాడేవాళ్ళం. కానీ, ఇప్పుడు మార్కెట్లోకి రకరకాల నూనెలు వచ్చాయి. పల్లీ, నువ్వుల నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ బాబోయ్.. ఈ నూనెలు మంచివి. లైట్‌గా ఉంటాయి. గుండెకి చాలా మంచివంటూ యాడ్స్‌లో చూసి వాటినే వాడడం మొదలెట్టాం. కానీ, ఇందులో నిజాలు చాలా తక్కువ. మరి ఏ నూనెలు వాడితే కొలెస్ట్రాల్ తగ్గి గుండెకి మంచిదో తెలుసుకోండి.


ఫ్లాక్స్ సీడ్ ఆయిల్


ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి గుండెకి, ఆరోగ్యానికి ఎంత మంచివో అందరికీ తెలిసిందే. ఇవి ఎక్కువగా ఉండే అవిసెల్లోనే.. అందుకే, ఈ అవిసె నూనె కూడా వాడొచ్చు. దీనిని వాడడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ చాలా వరకూ తగ్గుతుంది. ఇప్పుడు చెప్పిన ఆయిల్స్ అన్నీ కూడా చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అయితే, వీటితో పాటు మీరు చాలా విషయాలని గుర్తుపెట్టుకోవాలి. ఆయిల్ తక్కువ పరిమాణంలో తీసుకోవడం, వర్కౌట్ చేయడం, మంచి నిద్ర, మంచి ఆహారం వంటివి ఫాలో అయితే చాలా వరకూ రిజల్ట్ ఉంటుంది.


ఈ సింపుల్ చిట్కాలతో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోండి


కొబ్బరినూనె


కొబ్బరినూనె కూడా వంటలకి చాలా మంచిది. స్మోక్ పాయింట్ పరంగా వీటిని 200 డిగ్రీల వరకూ వేడి చేయొచ్చు. పూరీ, పకోడీ, పరాఠాలు వంటి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కోసం వీటిని వాడొచ్చు. రుచి కాస్తా డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే, ఫ్రైడ్ ఫుడ్స్‌లో రుచి మరీ అంతగా తెలియకపోవచ్చు. అయినా మనకి ఆరోగ్యం కావాలంటే ఆ రుచికి కూడా మనం అలవాటు పడతాం.


ఆలివ్ ఆయిల్


ఈ ఆయిల్ చూడ్డానికి చాలా థిక్‌గా ఉంటుంది. ఆలివ్ ఆయిల్‌లో మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీనిని వాడడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ నూనెని అంతకు ముందు ఎక్కువగా వాడేవారు కాదు. కానీ, ఇందులోని గుణాలు తెలిశాక చాలా మంది వంటలకి దీనినే వాడుతున్నారు. సలాడ్, మీట్, వెజిటేబుల్స్‌పై కాస్తా వేసుకుని కూడా తింటున్నారు. విదేశాల్లో అయితే, ఈ నూనెని మరింత ఎక్కువగా వాడుతున్నారు. దీనికి కారణం ఇందులోని హెల్దీ ఫ్యాట్స్. అందుకే, ఈ నూనె వాడొచ్చు.


నువ్వుల నూనె


నువ్వుల నూనెని ముందు రోజుల నుంచి మన పెద్దలు వాడేవారు. ఇందులో మోనో శాచ్యురేటెడ్, పాలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని వాడడం వల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వీటిని ఎక్కువగా పచ్చళ్లలోనూ వాడతారు. కాబట్టి, ఈ నూనెని కూడా వాడొచ్చు. ఈ నువ్వుల నూనెని వాడడం వల్ల బరువు కూడా తగ్గుతారు.​


వాల్‌నట్ ఆయిల్


వాల్‌నట్ ఆయిల్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. దీనిని వాడడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ నూనెని సలాడ్స్, లైట్‌గా ఫ్రై చేసే ఫుడ్స్‌కి చాలా బెస్ట్. రెగ్యులర్‌గా ఈ నూనె వాడితే చెడు కొలెస్ట్రాల్ ఆటోమేటిగ్గా తగ్గుతుంది. ఈ ఆయిల్ ప్రతీ సూపర్‌మార్కెట్‌లోనూ దొరుకుతుంది. ఆన్‌లైన్ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే, లేబుల్ పూర్తిగా చదివాకే తీసుకోండి.


పల్లీ నూనె


పల్లీనూనెలో కూడా అద్భుత గుణాలున్నాయి. ఇవన్నీ కూడా చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతాయి. వీటిని రెగ్యులర్‌గా కూడా మనం వంటల్లో వాడొచ్చు. అయితే, పరిమాణం ఎంత వేస్తున్నామనేది చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com