ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెలలో రిలీజ్ అయ్యే మొబైల్స్ ఇవే......

Technology |  Suryaa Desk  | Published : Mon, Feb 03, 2025, 12:01 PM

ఈ ఏడాది ఇప్పటికే టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ ఎన్నో లాంఛ్ అయ్యాయి. జనవరిలో సామ్సాంగ్ S25 సిరీస్ తో పాటు వన్ ప్లస్ 13 లాంఛ్ అయ్యి టెక్ ప్రియులకు ఫుల్ జోష్ ఇచ్చేశాయి. మరి ఇప్పుడు ఫిబ్రవరిలో మరిన్ని లేటెస్ట్ మొబైల్స్ లాంఛ్ కాబోతున్నాయి. ఆ మొబైల్స్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఫిబ్రవరిలో టాప్ బ్రాండ్ కంపెనీలకు చెందిన ఎన్నో మొబైల్స్ రాబోతున్నాయి. ఇందులో వివో v50, నథింగ్ ఫోన్ 3a, రియల్ నియో 10R, ఐక్యూ నియో 10R ఉన్నాయి. ఈ మొబైల్ ఫీచర్స్ అదిరిపోయేలా ఉన్నాయి. వీటిలో కెమెరా ఫీచర్స్ పాటు డిస్ ప్లే, బ్యాటరీ, ప్రాసెసర్ టెక్ ప్రియులను ఆకట్టుకునేలా ఉన్నాయి.


Vivo V50 మొబైల్.. ప్రీమియం ఫీచర్లతో రాబోతున్న స్మార్ట్‌ఫోన్. ఇది వినియోగదారులకు ఆడ్వాన్స్డ్ టెక్నాలజీను అందిస్తుంది. 6.5 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ స్క్రోలింగ్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది. ఈ ఫోన్ 48MP ప్రైమరీ కెమెరా, 8MP వైడ్ యాంగిల్ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్‌తో త్రిపుల్ కెమెరా సెటప్‌తో రాబోతుంది. 32MP సెల్ఫీ కెమెరా, 5G కనెక్టివిటీ, ఫాస్ట్ ఛార్జింగ్ 33W, 5000mAh బ్యాటరీ, పవర్‌ఫుల్ MediaTek Dimensity 1200 చిప్‌సెట్‌తో రాబోతుంది. 8GB RAM, 128GB స్టోరేజ్ తో గేమింగ్, మల్టీటాస్కింగ్ కు సపోర్ట్ చేస్తుంది.


iQOO Neo 10R బెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా రాబోతుంది. Snapdragon 8s Gen 3 చిప్‌సెట్ తో 6.78 అంగుళాల డిస్ ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌, 80/100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,400 mAh బ్యాటరీ సపోర్ట్ తో వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. iQOO Neo 10R మెుబైల్ Android 15 ఆధారిత FunTouchOS 15 పై రన్ అవుతుందని తెలుస్తుంది.


నథింగ్ ఫోన్ (3a) FullHD+ రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల 120Hz AMOLED స్క్రీన్‌ను కలిగి ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. 32MP సెల్ఫీ షూటర్‌, 2x ఆప్టికల్ జూమ్‌, 50MP టెలిఫోటో సెన్సార్‌, 50MP ప్రైమరీ షూటర్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ తో రాబోతున్నట్లు అంచనా. అల్ట్రావైడ్ కెమెరాను 8MP ఫీచర్ తో రాబోతుంది. నథింగ్ ఫోన్ (3a) స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్‌సెట్‌, 8GB RAM + 128GB స్టోరేజ్ తో రాబోతున్నట్లు తెలుస్తుంది. కాగా నథింగ్ ఫోన్ (3a) ప్రో ఒకే 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5.000mAh బ్యాటరీతో రూ. 25000లోపే అందుబాటులో ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. 


Mediatek Dimensity 9300+ తో రాబోతున్న realme Neo7 మెుబైల్ బెస్ట్ మిడ్ రేంజ్ ఆఫ్షన్ గా ఉండనుంది. 16 GB RAM, 1 TB ఇంటర్నల్ స్టోరేజ్ తో రాబోతున్న ఈ మెుబైల్ realmeUI 6తో పనిచేస్తుందని తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com