ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాల అమలు, తీరుతెన్నులపై కేంద్ర హోంశాఖలో సోమవారం కీలక సమావేశం జరిగింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ భేటీ జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని ప్రధాన అంశాల పరిష్కారంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. విభజన చట్టం 9, 10 షెడ్యూల్‌లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్‌ల విభజన, వాటి ఆస్తులు, అప్పుల పంపకాలపై చర్చించనున్నారు. ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, చట్టంలో పేర్కొన్న మరికొన్ని సంస్థల విభజనపై చర్చ జరిగే అవకాశం ఉంది.