2014-19 మధ్య అభివృద్ధికి, ఆ తర్వాత ఐదేళ్లలో చోటు చేసుకున్న దుష్పరిపాలనతో పొంతన లేకుండా పోయిందని, రాష్ట్రం చాలా నష్ట పోయిందని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ తో జరిగిన సమీక్షలో చంద్రబాబు తెలిపారు. 2019-24 మధ్య జరిగిన ఆర్థిక విధ్వంసంపై ప్రత్యేకంగా ప్రజంటేషన్‌లో సీఎం చంద్రబాబు వివరించారు. దీని కారణంగా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చూపుతున్న ప్రభావం గురించి ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు వివరించారు. గత ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల అప్పులు తీసుకువచ్చారని, దానికి తోడు మరో రూ. లక్షన్నర కోట్లకు పైగా... పెండింగ్ బిల్లులు పెట్టిపోయారని చంద్రబాబు తెలిపారు. ఈ పరిణామాల నుంచి రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ప్రజంటేషన్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. పోర్టులు, లాజిస్టిక్ పార్కులు, పరిశ్రమలు వచ్చేందుకు అనువైన వాతావరణాన్ని ఎలా తయారు చేస్తోంది. పోర్టు ఆధారిత అభివృద్ధికి ఉన్న మార్గాలపై కూడా వివరించి అందుకు సహకరించాలని కోరారు.