ఏపీలో వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైన తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని,గుడ్ గవర్నెన్స్ అంటే ఇదేనా అని రాజ్యసభ ఎంపీ వైవీసుబ్బారెడ్డి ప్రశ్నించారు. ‘ఏకంగా సోషల్ మీడియా కార్యకర్తలపై ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసులు పెడుతున్నారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదు.రెడ్‌బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు.ప్రధాని,హోంమంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి.చంద్రబాబు ఏపీలో మేనిఫెస్టో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. సూపర్‌సిక్స్ పేరుతో మేనిఫెస్టో ఇచ్చారు.20 లక్షల ఉద్యోగాలు,ఫ్రీ బస్సు ఇస్తామన్నారు. రైతులకు 20వేలు ఇస్తానన్నారు. మేనిఫెస్టో అమలు చేయకపోతే ఎన్నికల సంఘం,సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి.
ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలి.వక్ఫ్ సవరణ బిల్లును మేం వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లుపై తొందరపాటు తగదు.ఏపీలో ఇప్పటివరకు జనాభా లెక్కలు జరగలేదు.ఏపీలో ప్రత్యేకంగా జనాభా లెక్కల కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.వైయస్ఆర్‌సీపీ కృషివల్లే కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూడో బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఉత్పత్తి ప్రారంభించబోతోంది. ఉద్యోగుల జీతాలను సైతం చెల్లించలేకపోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడానికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం.సెయిల్‌లో విలీనం చేయడంలో విఫలమయ్యారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించాలి’అని వైవీసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.