దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ట్రేడింగ్ అవుతున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 500 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ 23,500పైన ప్రారంభమైంది. ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్ 488 పాయింట్ల లాభంతో 77,675 వద్ద.. నిఫ్టీ 150 పాయింట్లు పెరిగి 23,509 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీ, టాటా, అదానీ పోర్ట్స్, తదితర కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.