విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని మార్చి 12వ తేదీకి వాయిదా వేసినట్టు అనకాపల్లి పార్లమెంటు పరిశీలకుడు కరణం ధర్మశ్రీ మంగళవారం తెలిపారు. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పార్టీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అనుమతి ఇవ్వాలని కోరిన ఈసీ స్పందించలేదన్నారు.