మూడు రోజుల పాటు జరుగుతున్న ఉత్సవాలతో శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ వచ్చిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆరోగ్య ప్రదాత దర్శనం కోసం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారన్నారు. ఆలయం అభివృద్ధికి చర్యలు చేపట్టామని, కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అరసవెళ్లి ఆలయాన్ని ప్రసాదం స్కీమ్‌లో చేరుస్తామని చెప్పారు. సూర్య భగవానుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రాచీన దేవాలయాలను కాపాడుకోవాలి అన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా కార్యక్రమం చేయాలనే ఆలోచనతో పకడ్బంధిగా చేశామని చెప్పారు.కాగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ప్రభుత్వ చేసిన ఏర్పాట్లపై వారు ఆనందం వ్యక్తం చేశారు. స్వామివారిని గాయని మంగ్లీ, ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు తదితరులు దర్శించుకున్నారు.