పల్నాడు జిల్లా నాదెండ్లలో జరిగిన రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలలో పంగులూరుకు చెందిన చిలుకూరి నాగేశ్వరరావు ఎడ్లజతకు ద్వితీయ స్థానం దక్కింది. విఘ్నేశ్వరస్వామి వార్షిక మహోత్సవం సందర్భగా నాదెండ్లలో ఉమ్మ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో నిర్వహించిన బండలాగుడు పోటీలో గొట్టిపాటి యూత్ సారథ్యంలో పంగులూరుకు చెందిన నాగేశ్వరరావు ఎడ్ల జత పాల్గొంది. ఈ పోటీలో సోమవారం రాత్రి జరిగిన పోటీలో పాల్గొన్న పంగులూరు ఎడ్లజత నిర్ణీత 15 నిముషాలలో 39,023 అడుగుల దూరాన్ని చేరుకుని ద్వితీయ స్థానంలో నిలిచాయి. ఈ పోటీలో పాల్గొన్న పురుషోత్తపట్నం ఎడ్లజత 33 అడుగుల తేడాతో ప్రధమస్దానంలో నిలువగా పంగులూరు ఎడ్లజతకు ద్వితీయ స్దానం దక్కింది. గత నెలలో సంక్రాంతి సందర్భంగా అన్నంబొట్లవారిపాలెంలో జరిగిన పోటీలతో పాటు రెంటచింతలలో జరిగిన ఎడ్ల బండలాగుడు పోటీలలో ఈ ఎడ్డజతకు రాష్ట్రస్దాయిలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఎడ్ల యజమాని నాగేశ్వరరావు తెలిపారు.