రథసప్తమి పర్వదినం సందర్భంగా మంగళవారం టీటీడీ కల్యాణ మండపంలోని శ్రీవారి ఆలయంలో తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తున్నట్లు టీటీడీ టెంపుల్ ఇన్‌స్పెక్టర్ లలిత తెలిపారు. ఆలయంలో ఉదయం 6.45 నిముషాలకు స్వామివారి ఊరేగింపు ఉత్సవం ప్రారంభమవుతుందని, ప్రధాన ఆలయం నాలుగు వైపుల స్వామివారి ఉత్సవ విగ్రహాలను పూల అలంకరణతో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ మహోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి ఆశీస్సులు పోందడంతో పాటు తీర్థ, ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. స్వామివారి ఊరేగింపు సమయంలో ఉత్సవ విగ్రహలకు భక్తులు స్వయంగా ఇచ్చే కర్పూర హారతులు స్వీకరించడతాయని తెలిపారు.