ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఫిబ్రవరి 23న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది. దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. సోమవారం ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఆన్‌లైన్ టికెట్ల సేల్‌ను ఐసీసీ ప్రారంభించింది. సేల్ మొదలైన గంటలోపే టికెట్లు మొత్తం అమ్ముడుపోయాయి. సేల్ ముగిసే టైమ్‌కు కూడా లక్షయాభై వేలకు మందికి పైనే క్రికెట్ ఫ్యాన్స్ టికెట్ల కోసం ఆన్‌లైన్‌లో వెయింటింగ్‌లో ఉన్నట్లు ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేశాడు.
టికెట్ల కాస్ట్ భారీగానే ఉంది. ప్లాటినం కేటగిరీలో 2000 దీనార్లు (59 వేలు), గ్రాండ్ లాంజ్ కేటగిరీలో 5000 దీనార్లు (లక్ష పద్దెనిమిది వేలుపైనే ) ఉన్నాయి. అయినా కూడా గంట లోపే టికెట్లు అమ్ముడుపోవడం మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా క్రికెట్ ఫ్యాన్స్ చెబుతోన్నారు. ఇంత తక్కువ టైమ్‌లోనే టికెట్లు మొత్తం అమ్ముడుపోవడం క్రికెట్ హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైమ్ అని, ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ రికార్డును క్రియేట్ చేసిందని క్రికెట్ వర్గాలు చెబుతోన్నాయి.