నెల్లూరు జిల్లాలో పావురాళ్ల పందాల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. తమిళనాడు నుంచి ఐషర్ ట్రక్కుల్లో పావురాళ్లని పెద్ద సంఖ్యలో నెల్లూరు జిల్లాకు తరలిస్తున్నారు. కన్యాకుమారి, తిరుత్తని, తిరునల్వేలిలోని క్లబ్బుల నుంచి పావురాలను తరలిస్తున్నారు. బిట్రగుంట రైల్వే ఫుట్ బాల్ క్రీడా మైదానం నుంచి క్లబ్ నిర్వాహకులు 800 పావురాళ్లను వదిలారు. అక్కడ రూ.కోట్లలో పందాలు జరుగుతున్నాయి. గతంలో చెన్నై నుంచి పావురాళ్లతో వచ్చే క్లబ్బుల సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని హెచ్చరించి పంపివేశారు. అప్పటి నుంచి చెన్నై క్లబ్బుల సిబ్బంది రాక పూర్తిగా తగ్గింది. ప్రస్తుతం తమిళనాడులోని ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నెల్లూరు జిల్లాకు క్లబ్బుల సిబ్బంది, పందెం రాయుళ్లు వస్తున్నారు.