చెన్నై నగరంలో, నగర శివారు ప్రాంతాల్లో మంగళవారం దట్టమైన మంచు అలముకోవడంతో విమాన, రైలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మీనంబాక్కం ఎయిర్‌పోర్ట్, చోళింగనల్లూరు, పెరుంబాక్కం, ఈస్ట్‌కోస్ట్ రోడ్డు, మేడవాక్కం, చిట్లపాక్కం, ఒట్టియంబాక్కం తదితర ప్రాంతాల్లో వేకువజాము ఐదు గంటల నుండే దట్టమైన మంచు దుప్పటిలా కప్పేసింది. దీంతో రోడ్లలో వెళుతున్న వాహనాలు కనిపించ వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. చెంగల్పట్టు- చెన్నై బీచ్‌స్టేషన్ నడుమ లోకల్ విద్యుత్ రైళ్లు కూడా మంచు కారణంగా నత్తనడక నడిచాయి. పట్టాలు కనిపించకపోవడంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్లన్నీ పావుగంట నుంచి అరగంట మేర ఆలస్యంగా గమ్యస్థానాలు చేరుకున్నాయి.