పైనాపిల్ జ్యూస్ తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిలోని ఫైబర్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ రసాన్ని తాగితే ఆకలి అదుపులో ఉంటుంది. రోజూ వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరమై శరీరంలో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది శరీర బరువును అదుపులో ఉంచుతుంది. చర్మం మంటను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.