తాజాగా ప్రకటించిన ఐసీసీ టీ20 ర్యాంకుల్లో భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ దూసుకొచ్చాడు. ఏకంగా 38 స్థానాలను మెరుగుపర్చుకొని రెండో ర్యాంక్‌కు చేరాడు. ప్రస్తుతం అభిషేక్ 829 పాయింట్లతో ఉన్నాడు. ఇక అగ్రస్థానంలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (855 పాయింట్లు) కొనసాగుతున్నాడు. తర్వాతి స్థానాల్లో తిలక్ వర్మ (803), ఫిల్ సాల్ట్ (798), సూర్యకుమార్ యాదవ్ (738) ఉన్నారు.