శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తేదీలను కూడా ఖరారు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతాయని ఆలయ ఈవో శ్రీనివాసరావు ఇటీవలే వెల్లడించారు. మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నెల 23న స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సీఎం చంద్రబాబు సమర్పించనున్నారు.అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఉద్యోగి భక్తులకు సౌకర్యాల కల్పన పట్ల పూర్తి శ్రద్ధ వహించాలన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ముందస్తుగా చేపట్టాల్సిన సౌకర్యాలపై ప్రణాళికలు సిద్ధ చేయాలని ఈవో పేర్కొన్నారు. ఫిబ్రవరి మొదటివారంలోగా అన్ని ఏర్పాటు పూర్తి అయ్యేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. గత ఏడాది ఈసారి మరింతగా ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా శివరాత్రి రోజు జరిగే ప్రభోత్సవం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం, మరునాడు జరిగే రథోత్సవం కార్యక్రమాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. క్యూలైన్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.