టీమ్ఇండియా పేసర్ హర్షిత్ రాణా అరుదైన ఘనత సాధించాడు. టీ20, వన్డే, టెస్టుల్లో అరంగ్రేటం చేసిన మ్యాచ్‌ల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడం ద్వారా హర్షిత్ రాణా ఈ ఘనత సాధించాడు. ఇదే ఇంగ్లాండ్ పై కొద్ది రోజుల ముందు జరిగిన టీ20 సిరీస్‌లో నాలుగో టీ20 మ్యాచ్ ద్వారా పొట్టి ఫార్మాట్‌లో అనూహ్యంగా అరంగ్రేటం చేశాడు. శివమ్ దూబె కంకషన్‌కు గురి కాగా.. కంకషన్ సబ్‌గా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో అతడు నాలుగు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకముందు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్‌లో రాణా అరంగ్రేటం చేశాడు. ఆ మ్యాచ్‌లో రాణా 48 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.
టెస్టు – ఆస్ట్రేలియా పై 3/48
టీ20 – ఇంగ్లాండ్ పై 3/33
వన్డే- ఇంగ్లాండ్ పై 3/53 (నేటి మ్యాచ్‌లో )