ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాక‌ర్స్ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలి - శ్రీ‌కాకుళం క‌లెక్ట‌ర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 03, 2019, 09:38 PM

మహాత్మాగాంధీ సిద్దాంతాలను , ఆశయాలను ఆచరణలోకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్న స్టార్ వాకర్స్ క్లబ్ గాంధీజీ పిలుపునిచ్చిన స్వచ్చతే సేవా కార్యక్రమంలో కూడా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో పూజ్య బాపూజీ 150వ జయంతోత్సవ ముగింపు కార్యక్రమం స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా జె.సి-2 పి.రజనికాంతారావుతో కలసి గాంధీజీ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గాంధీజీ ఆసయాలను, సిధ్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ప్రయత్నం చేస్తున్న స్టార్ వాకర్స్ క్లబ్ అభినందనీయమని కొనియాడారు. గాంధీజీ సిద్దాంతాలు, ఆయన మార్గాన్ని నేడు ప్రపంచదేశాలు కూడా వాటిని అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. గాంధీ చూపిన మార్గాల్లో ముఖ్యమైనది సత్యం, అహింసా అని, వాటితో దేనినైనా సాధించవచ్చని అగ్ర రాజ్యాలుసైతం ఒప్పుకున్నాయన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడిచిన నాడే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అని అన్నారు. అలాగే గాంధీజీ పిలుపునిచ్చిన వాటిలో స్వచ్చతే సేవా ఒకటని, దానిలో కూడా వాకర్స్ క్లబ్ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వచ్చ సిక్కోలుకు సహకరించాలని సభ్యులను కోరారు. ముందుగా మన నుండే మార్పు రావాలని ఆ దిశగా ప్రతీ ఒక్కరూ స్వచ్చ శ్రీకాకుళానికి ముందుకురావాలని అన్నారు.స్వచ్చతే సేవా కార్యక్రమాన్ని గ్రామస్థాయిలోకి తీసుకువెళ్ళాలని పిలుపునిచ్చారు. అందరూ కలసిమెలసి శ్రమదానం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి స్వచ్చ సిక్కోలుగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా కలెక్టరు కోరారు.
అనంతరం జిల్లాలో గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా విశేష కృషిచేసిన హరిశ్చంద్రపురం మాజీ శాసనసభ్యులు కె.ఎ.ఎన్.గుప్తా, బంటుపల్లి గ్రామాన్ని బంగారు బంటుపల్లిగా సుమారు రూ.15 కోట్లతో అభివృద్ధి చేసిన ఎన్. ఈశ్వరరావు ( రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ ), జిల్లావ్యాప్టంగా 150 గాంధీజీ విగ్రహాలను పంపిణీచేయడమే కాకుండా వైద్యవృత్తిలో పలు సేవలు అందిస్తున్న డా.పి.వి.ఎస్.రామ్మోహనరావులను జె.సి-2 పి.రజనికాంతారావుతో కలసి దుశ్శాలువ,జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా వాకర్స్ క్లబ్ కు ఆర్ధిక సహాయ సహకారాలు అందించి ప్రొత్సహిస్థున్న జి.ఇందిరాప్రసాద్,ఆర్.వి.వి.ప్రసాదరావు, కామేశ్వరరావు,గుడ్ల సత్యనారాయణ,కూన వెంకట రమణమూర్తి,సింహాద్రి వేణుగోపాలరావు,గొర్లె వాసుదేవరావు,బి.వి.రవిశం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa