ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమాన్ని నందిగామ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నూతన చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి ని ఏపీ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కౌన్సిలర్లు ఘనంగా సత్కరించారు. ముందుగా ఎమ్మెల్యే కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.