గత 30 సంవత్సరాలుగా యానం ప్రజల కు సేవ చేస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజాసేవకే జీవితమును అంకితం చేస్తానని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు పేర్కొన్నారు .ఆదివారం ఉదయం స్థానిక అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలోపలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారుల పంపిణీ చేసి కార్యక్రమాన్ని అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాలలో యానం కు ప్రజలు మరువలేని ప్రాజెక్టులు తీసుకెళ్తానని వాటిని త్వరలో పూర్తి చేసి ప్రజలకు సౌకర్యములు కల్పిస్తున్నట్లు తెలిపారు .విద్య ,వైద్య ,పర్యాటక రంగాలలో యానం ను అభివృద్ధి చేశానని ఇంకా అనేక స్కీమ్స్ తెచ్చి ప్రజలను పబ్లిక్ చేస్తున్నట్లు తెలిపారు .ఇప్పటికే 30 సంవత్సరాల నుండి ప్రజలను అభివృద్ధి పరిచి సేవలు చేస్తున్నానని ఇంకా జీవితం ఉన్నంతవరకు ప్రజాసేవకే అంకితం అన్నారు .మరో ముఖ్య అతిథి డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా మాట్లాడుతూ యానం చిన్న ప్రాంతం అయినను ఎంతో అభివృద్ధి చెందిందని దీనికి కారణం మంత్రి మల్లాడి కృషి అన్నారు .ఈ కార్యక్రమంలో మంత్రి ఆయా కులాల వారికి కుల పనిముట్లు ,వృద్ధాప్య పింఛన్లు ,వివిధ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ఇచ్చే చెక్కులు ,20 కేజీల ఉచిత బియ్యం ,మత్యకారుల భీమా చెక్కులు ,వరదలు ,వర్షాల నష్టపరిహార చెక్కులు తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గౌరీ సరోజ ,ఎస్పి రచన సింగ్ ,డిప్యూటీ తాసిల్దారు సత్యనారాయణ ,వ్యవసాయ శాఖ అధికారి తెలుగు శంకర్ మురగన్ ,ఇతర శాఖల అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa