రాజ్మాను తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాజ్మాలో కాల్షియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. ఆస్టియోపోరోసిస్ లాంటి వ్యాధులను నిరోధించడానికి సహాయపడుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే ఫైబర్ మలబద్ధకం, అజీర్ణం లాంటి సమస్యలను నివారిస్తుందని పేర్కొంటున్నారు. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.