కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నేతతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. టికెట్ల విషయంపై ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి సీఎం స్పష్టత ఇచ్చారు. పత్తికొండ, డోన్ నియోజకవర్గాల కేఈ కుటుంబానికేనని చంద్రబాబు స్పష్టం చేశారు. జిల్లాలోని పలు నియోజకవర్గా నేతతో విడివిడిగా భేటీ అయిన చంద్రబాబు పు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. డోన్ నియోజకవర్గాన్ని కేఈ ప్రతాప్, పత్తికొండకు కేఈ శ్యాంబాబు పేర్లను ఎంపిక చేశారు. అలాగే జిల్లాలోని మంత్రాయం నియోజకవర్గం నుంచి తిక్కారెడ్డి, ఎమ్మిగనూరు నుంచి బీవీ జయనాగేశ్వరరెడ్డి, బనగానపల్లె నుంచి బీసీ జనార్ధన్‌రెడ్డిని అభ్యర్థులుగా ఎంపికచేశారు. కర్నూలు, ఆదోని అసెంబ్లీ నియోజకవర్గాల కేటాయింపులపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేశ్ తనయుడు భరత్ కర్నూలు అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. కర్నూలు ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తానని ఇటీవల కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఆదోని స్థానం కోసం బుట్టా రేణుక, మీనాక్షి నాయుడు పోటీ పడుతున్నారు. అయితే, ఈ స్థానాన్ని కూడా ఎవరికి కేటాయిస్తారనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.