జనసేన పోరాట యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకుని శ్రీ పవన్‌కళ్యాణ్ గారు నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టారు. చిత్తూరు జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం వరకు వివిధ వర్గాలతో నిర్వహించిన పార్టీ సమావేశాల్లో శ్రీ పవన్‌కళ్యాణ్ గారు పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జనసేన శ్రేణులు భారీ ర్యాలీగా వెంటరాగా గంగాధర నెల్లూరు, కార్వేటినగరం, పుత్తూరు, శ్రీకాళహస్తి మీదుగా నెల్లూరు జిల్లాకి పయనమయ్యారు. శ్రీ పవన్‌కళ్యాణ్ గారు వస్తున్న విషయం తెలుసుకున్న ప్రజలు వేలాదిగా పుత్తూరుకి చేరుకున్నారు. బాణసంచా పేలుళ్లు, హారతులతో ఆయనకి ఆహ్వానం పలికారు. ఇసుక వేస్తే రాలనంత జనం, ప్రతి ఒక్కరి చేతిలో జనసేన జెండాలతో పుత్తూరు పట్టణం కళకళలాడింది. వేలాదిగా తరలివచ్చిన జనసందోహాన్ని అదుపు చేయడం ఒక దశలో సెక్యూరిటీ సిబ్బందికి సైతం ఇబ్బందిగా మారింది. అభిమానులు ప్రేమతో తన కోసం తీసుకు వచ్చిన పూలదండల్ని, ఎర్రకండువాలని స్వీకరించారు. ఓ అభిమాని జనసేన సింబల్‌తో డిజైన్ చేసిన గొడుగుని శ్రీ పవనకళ్యాణ్ గారికి బహూకరించగా.ఆయన దాన్ని వెంటనే వేసుకున్నారు. తన కోసం తరలివచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపి ముందుకి సాగారు. పుత్తూరు-శ్రీకాళహస్తి మధ్య కూడా పలు గ్రామాల ప్రజలు ఆయన్ని చూసేందుకు రోడ్ల మీదికి వచ్చారు. వాహనశ్రేణి పైకి వచ్చి తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకి సాగారు. అనంతరం శ్రీకాళహస్తిలో మరో జనప్రవాహం ఆయనకి వీడ్కోలు పలికేందుకు బైపాస్ మీదికి వచ్చింది. పూల వర్షం కురిపిస్తూ, నినాదాలు చేస్తూ చిత్తూరు జిల్లా వాసులు ఆయన్ని సాగనంపారు. చిత్తూరు నుంచి నెల్లూరు జిల్లాకి చేరుకోవడానికి సుమారు ఐదు గంటల సమయం పట్టింది. పోరాటయాత్ర కోసం సింహపురికి విచ్చేస్తున్న శ్రీ పవన్‌కళ్యాణ్ గారికి నాయుడుపేటలో నెల్లూరు జిల్లా వాసులు ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టగా, జనసేన శ్రేణులు పూలతో అభిషేకించాయి. అక్కడి నుంచి గూడూరు మీదుగా ఆయన నెల్లూరు చేరుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa