ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అబ్బే..... మసూద్ చనిపోలేదంటున్న‌ జైషే వర్గాలు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 03, 2019, 11:12 PM

జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ అనారోగ్యంతో మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. మసూద్ అజహర్ లివర్ క్యాన్సర్ కారణంగా మృతిచెందాడని కొన్ని పుకార్లు తెరపైకి వచ్చాయి. భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్-2లో అతడు ప్రాణాలు కోల్పోయాడని మరికొన్ని కథనాలు వచ్చాయి. కరడుగట్టిన ఉగ్రవాది అతను.. అతని మరణవార్త నిజమైతే బాగుండని చాలా మంది సోషల్ మీడియాలో కోరుకుంటున్నారు. అయితే మసూద్ అజహర్ చనిపోయాడని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని, అతను బతికే ఉన్నాడని జైషే మహ్మద్ వర్గాలు వెల్లడించాయి. మసూద్ అజహర్ ఆరోగ్యంగా ఉన్నాడని ఓ ప్రకటనలో తెలిపాయి. మసూద్ అజహర్ రెండు కిడ్నీలు చెడిపోవడంతో రావల్పిండి ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు కొన్నిరోజుల క్రితమే పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి చెప్పారు.  తమ దేశంలోనే వున్నా అతని ఆచూకీ ఎక్కడో సరిగ్గా చెప్పలేమని ఆయన అన్నారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందేందుకే పాకిస్థాన్ మసూద్ అజహర్ చనిపోయాడంటూ ప్రచారం చేస్తోందనే వార్తలు కూడా వినిపించాయి. మరి అతని జాడ ఎక్కడ? సర్జికల్ స్ట్రైక్2 జరిగినప్పటికీ అతను తెరమీదరకు రాకపోవడానికి కారణం ఏంటని ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తున్నాయి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa