ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. 12 ఏళ్ల ఆమ్‌ఆద్మీ పార్టీ పాలనకు ఢిల్లీ ప్రజలు చరమగీతం పాడారు.తాజా సమాచారం మేరకు 70 అసెంబ్లీ స్థానాలకు గాను 47 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ 23 స్థానాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 47 శాతం ఓట్ షేర్ సాధించి ఆగ్ర స్థానంలో నిలిచింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ , మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మంత్రులు ఘోర ఓటమి చవిచూశారు.ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం గట్టిగానే పని చేసింది. ఎన్నడూ లేనివిధంగా బీజేపీ (BJP)కి దళిత, ఓబీసీ ఓటర్లు మద్దతు లభిచింది. మరోవైపు ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్ పార్టీ లు విడివిడిగా పోటీ చేయడం వల్ల బీజేపీ లాభ పడిందని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కనీసం బోణీ కూడా కొట్టలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకున్నారని అన్నారు. తమ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు అవిశ్రాంతంగా పని చేశారని కోనియాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైనా.. ఢిల్లీ ప్రజల తరఫున తమ పోరాటం కొనసాగిస్తామని ప్రియాంక గాంధీ కామెంట్ చేశారు.