ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పత్‌పర్‌గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆప్ నేత అవధ్ ఓజా ఓటమి పాలయ్యారు. నేటి ఫలితాల్లో పత్‌పర్‌గంజ్ నుంచి బీజేపీ అభ్యర్థి రవీందర్ సింగ్ నేగి తన సమీప అభ్యర్థి అవధ్ ఓజాపై విజయం సాధించారు. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు నేడు ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో పోలిస్తే బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది.
![]() |
![]() |