ములకలచెరువులో శనివారం జరిగిన రోడ్డుప్రమాద మృతుల వివరాలు లభించినట్లు ఎస్సై నరసింహుడు తెలిపారు. మృతులు మదనపల్లి ప్రశాంత్ నగర్ కు చెందిన భవన కార్మికుడు సోమశేఖర్(35), భార్య కవిత (25), కొడుకు రెడ్డి శేఖర్(05), కుమార్తె సిద్దేశ్వరి(03)గా గుర్తించామన్నారు.
కదిరిలో పెదనాన్న అంత్యక్రియలకు బైకుపై వెళుతుండగా మొలకలచెరువులో ఐషర్ ఢీకొట్టి తండ్రి కుమార్తె చనిపోగా భార్య కుమారుడిని రుయాకు తరలించారు.